For Money

Business News

ఈ వారంలోనూ అనిశ్చితే…

ఈ వారంలో కూడా స్టాక్‌ మార్కెట్‌లో ఆటుపోట్లు తప్పేలా లేవు. గత వారం ఒక దశలో 16,800 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ, అతి కష్టం మీద 17,500-17,600 పాయింట్లకు చేరువైనా, ఆ స్థాయిల్ని నిలబెట్టుకోలేక పోయింది. చివరికి శుక్రవారం 17,196.70 వద్ద ముగిసింది. నిఫ్టీ స్పష్టంగా 17,900 పాయింట్ల స్థాయిని అధిగమించే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 16,800 పాయింట్ల దిగువకు కూడా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వెంటనే ఈ పరిస్థితి రాకపోవచ్చు. పెరిగినపుడల్లా లాభాలు స్వీకరించడం మంచిది. ఈ వారం నిఫ్టీకి 17,350-17,500-17,600 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో 17,000-16,800 వద్ద మద్దతు లభించే అవకాశాలు కూడా అధికంగా కన్పిస్తున్నాయి.