For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

ఇండిపెండెన్స్‌ డే కారణంగా రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. యూరో మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. యూరో స్టాక్స్‌ 50లో మార్పు లేదు. జర్మనీ కూడా. ఫుట్సి మాత్రం అరశాతంపైగా లాభంతో ముగిసింది ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ మినహా అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా, హాంగ్‌సెంగ్‌ సూచీలు అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఒపెక్‌ దేశాల భేటీ రద్దుకావడంతో క్రూడ్‌ రాత్రి, ఇవాళ ఉదయం కూడా భారీ లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి కూడా స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్వల్ప నష్టం లేదా స్థిరంగా ప్రారంభం కానుంది.