For Money

Business News

15,800పైన లాభాల స్వీకరణ

ఓపెనింగ్‌లోనే ట్రేడర్స్‌కు మంచి అవకాశం లభించింది. ఆరంభంలోనే నిఫ్టిని అమ్మనవారికి 40 పాయింట్ల లాభం వచ్చింది. 15,796 వద్ద ప్రారంబమైన నిఫ్టి 15,762 పాయింట్లను తాకింది. ఉదయం పేర్కొన్నట్లు నిఫ్టికి 15,770 వద్ద తొలి మద్దతు అందింది.ఇపుడు నిఫ్టి 15,807 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 85 పాయింట్ల లాభంతో 15,807 వద్ద ట్రేడవుతోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి, మిడ్‌ క్యాప్‌, నిఫ్టి ఒకే స్థాయి లాభాలతో ఉన్నాయి. నిఫ్టిలో 47 షేర్లు లాభాల్లో ఉన్నా… లాభాలన్నీ ఒక శాతం లోపే ఉన్నాయి. నిఫ్టికి ప్రధాన ఒత్తిడి 15825 ప్రాంతంలో రావొచ్చు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐషర్‌ మోటార్స్‌ 2,707.05 1.73
హిందాల్కో 381.00 1.32
బజాజ్‌ ఆటో 4,222.45 1.13
టీసీఎస్‌ 3,362.10 1.10
పవర్‌ గ్రిడ్‌ 230.45 1.10
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 685.40 -0.31
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,569.90 -0.10
సిప్లా 979.00 -0.02