For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మొచ్చు

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. సింగపూర్ నిఫ్టి 25 పాయింట్ల నష్టం చూపుతోంది. ఈలెక్కన చూస్తే నిఫ్టి క్రితం ముగింపు వద్ద ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15,834.ఇవాళ నిఫ్టికి 15,800 కీలకం. దీనిపైన ఉన్నంత వరకు ఢోకాలేదు. దిగువకు వస్తే మాత్రం 15,770 వరకు మద్దతు లేదు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ 15,750 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. దిగువ స్థాయిలో కొనుగోలు చేసే వారు స్వల్ప లాభాలతో బయటపడటం మంచిది. డే ట్రేడింగ్‌లో అధిక స్థాయి లాభాలు పొందడమే బెటర్‌. క్రూడ్‌ ధరలు భారీగా పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. పైగా ఈనెలలో వచ్చే కార్పొరేట్‌ ఫలితాలు కూడా గొప్పగా ఉండకపోవచ్చు. కావొచ్చు… కాబట్టి నిఫ్టి స్వల్ప కదలికలను క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేయడం బెటర్‌. నిఫ్టి బలహీనంగా ఉన్నా… సాంకేతికంగా నిఫ్టి ఓవర్‌ సోల్డ్‌ నుంచి బయటపడుతోంది. కాబట్టి నిఫ్టిని కొన్నా, అమ్మినా స్వల్ప లాభాలకే పరిమితం అవ్వండి.