For Money

Business News

LEVELS: పడితే కొనండి

మార్కెట్‌ పడినపుడల్లా కొన్ని ఇన్వెస్టర్లకు మార్కెట్‌ మంచి లాభాలను ఇచ్చింది. బై ఆన్‌ డిప్స్‌ ఫార్ములా డే ట్రేడర్స్‌కు చాలా అనుకూలంగా ఉంది. డే ట్రేడర్స్‌ విషయానికొస్తే నిఫ్టి పడినపుడు కొనుగోలు చేయొచ్చని సీఎన్‌బీటీవీ ఆవాజ్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సూచించారు. అయితే మార్కెట్‌ ప్రారంభంలోనే కాకుండా.. గంట సేపు ఆగి పరిస్థితి చూసి కొనాలని ఆయన అన్నారు. నిఫ్టికి 18400 లేదా 18450 మధ్య కొనుగోలుకు ఛాన్స్‌ లభించవచ్చని ఆయన అన్నారు. ఈ స్థాయిలో కొనేవారు 18350 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని ఆయన చెప్పారు. అదే పొజిషనల్‌ ట్రేడర్స్‌ తమ పొజిషన్స్‌ను 18250 స్టాప్‌ లాస్‌తో కొనసాగింవచ్చని ఆయన అన్నారు. నిఫ్టి 18250 దిగువకు స్పష్టంగా పడినపుడే షార్ట్‌ చేసే అంశాన్ని పరిశీలించాలని… అప్పటి వరకు షార్టింగ్‌ జోలికి వెళ్ళొద్దని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి బ్యాంక్‌ 42800 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. 42,500ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని అన్నారు. ఫైనాన్షియల్‌ నిఫ్టి ఎక్స్‌పెయిరీ ఇవాళ ఉంది. 19100 నుంచి 19200 మధ్య సూచీ కదలాడ వొచ్చు. మూడు గంటలకల్లా ఈ 19100 పుట్స్‌, 19200 కాల్‌ జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సూచీ ప్రభావం బ్యాంక్‌ నిఫ్టిపై ఉండే అవకాశముంది. కాబట్టి నిఫ్టిలోనే ట్రేడ్‌ చేయడం మంచిదని అనూజ్‌ సింఘాల్‌ తెలిపారు.