For Money

Business News

అధిక స్థాయిలో ఒత్తిడి… కానీ

మార్కెట్‌ ప్రారంభం నుంచి ఆకర్షణీయ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 17348 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌సెషన్‌కు ముందు 17251 పాయింట్లను తాకింది. తరవాత కోలుకుని ఇపుడు 17305 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లన్నీ లాభాల్లో ఉన్నాయి. యూరో స్టాక్స్‌50 సూచీ 1.21 శాతం లాభంతో ట్రేడవుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. మరి వారాంతంలో అధిక స్థాయిలో నిఫ్టి కొనసాగుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే నిఫ్టి 17350 స్థాయిని క్రాస్‌ కాలేదు. నిఫ్టి బ్యాంక్‌ ఒక్కటే 2.2 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇతర సూచీలు ఒక శాతం లాభాలకే పరిమితం అవుతున్నాయి. ఇన్ఫోసిస్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ బాగా పెరిగాయి. ఇప్పటికీ 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరి నిఫ్టి 17350ని క్రాస్‌చేసి భారీ లాభాలతో ముస్తుందా లేదా లాభాల స్వీకరణ ఉంటుందా అన్నది చూడాలి.