For Money

Business News

స్థిరంగా నిఫ్టి ప్రారంభం

అమెరికా, ఆసియా మార్కెట్లకు భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. దాదాపు అన్ని సూచీలు దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. నిఫ్టి 17,439 వద్ద 39 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌, బ్యాంక్‌ నిఫ్టి షేర్ల సూచీలలో కూడా పెద్ద మార్పు లేదు. వారాంతం కావడంతో నిఫ్టికి ఇవాళ కూడా భారీ లాభాలు కష్టంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం హాంగ్‌కాంగ్‌తోపాటు యూరో మార్కెట్లు నష్టాల్లో ఉండటం. పైగా అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్‌ మళ్ళీ 70 డాలర్లను దాటింది. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌ మార్కెట్‌లో అమ్మడం తప్ప కొనుగోళ్ళు చేయడం లేదు. కేవలం ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో భారీ బిజినెస్‌ చేస్తున్నారు విదేశీ ఇన్వెస్టర్లు. ఈ నేపథ్యంలో నిఫ్టి 17500 ప్రాంతానికి వెళుతుందా… లేదా 17450 పైన నిఫ్టికి ఒత్తిడి ఎదురవుతుందా అన్నది చూడాలి.