For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి సంకేతాలకు అనుగుణంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఆరంభంలోనే 17,873కి పడినా, వెంటనే కోలుకుని ఇపుడు 17,919 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 21 శాతం లాభంతో ఉంది నిఫ్టి. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అన్నీ నామమాత్రపు లాభాలతో ఉన్నాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ కావడం, రేపు మార్కెట్‌కు సెలవు కావడంతో నిఫ్టి కదలికలు అధికంగా ఉండొచ్చు. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లలో కూడా ఈ స్థాయి నష్టాలు కన్పిస్తే… నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిఫ్టిలో మిడ్‌ సెషన్‌ తరవాత అధిక మార్పులు ఉండొచ్చు. నిఫ్టిలో ప్రస్తుతం 33 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఐటీసీ టాప్‌ గెయినర్‌గా ఉంది. ఇక మిడ్‌ క్యాప్స్‌లో ఎస్కార్ట్స్‌లో కొనుగోళ్ళ ఆసక్తి కొనసాగుతోంది. ఒకట్రెండు మినహా దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ లాభాల్లో ఉన్నాయి.