For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

ఈ నెలలో నిఫ్టికి తొలిసారి టెక్నికల్స్‌ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌లో వస్తున్న ఒత్తిడి ప్రభావం మన మార్కెట్లపై కూడా అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,898. నిఫ్టి ఇక్కడి నుంచి ఏ మాత్రం పెరిగినా అమ్మొచ్చు. నిఫ్టి 17,930 ప్రాంతంలో తొలి ప్రతిఘటన, 17960 వద్ద రెండో ప్రతిఘటనకు ఆస్కారం ఉంది. కాని సింగపూర్ నిఫ్టి ధోరణి చూస్తుంటే నిఫ్టి నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం అధికంగా ఉంది. ఒక వేళ పెరిగితే అమ్మండి. తొలి మద్దతు 17,840 వద్ద, రెండో మద్దతు 17,800 ప్రాంతం వద్ద లభించవచ్చు. ఈ స్థాయికి దిగువకు చేరితే 17,730కి వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మధ్యలో 17755 వద్ద మద్దతు అందుతుందేమో చూడండి.
ఇవాళ్టి ట్రేడింగ్‌ను రెండు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ఇక రెండోది.. రేపు మార్కెట్లకు సెలవు. గురునానక్‌ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. కాబట్టి… నిఫ్టిని కొనే ప్రయత్నం చేయొద్దు. వీలైతే అధికస్థాయిలో అమ్మి… స్వల్ప లాభంతో బయటపడండి.