For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16483 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16496 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలో 28 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అయితే లాభనష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ముందుంది. అలాగే నిరుత్సాహ ఫలితాలు ప్రకటించిన విప్రో నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ముందుంది. మెటల్స్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఫార్మా పరవాలేదు. దివీస్‌ ల్యాబ్‌ ..నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌ 5లో ఉంది. ఐటీ కౌంటర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టిలో హెచ్చుతగ్గులు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.