For Money

Business News

16550పైన నిఫ్టి

ఉదయం నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి అర గంటలోనే లాభాల్లోకి వచ్చేసింది. 16483 నుంచి 16592 దాకా వెళ్ళింది. ఇపుడు 16550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి స్వల్ప లాభాలతో ఉన్నా.. ఇతర సూచీలన్నీ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. బ్యాంక్‌, మిడ్‌క్యాప్‌, నెక్ట్స్‌ సూచీలు 0.9 శాతం దాకా లాభాల్లో ఉండటం విశేషం. నిఫ్టి 39 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఫలితాలకు రియక్టవుతూ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ ఏకంగా 8 శాతం లాభపడింది. నిఫ్టిలో టాప్‌ గెయినర్‌ ఈ బ్యాంక్‌ కాగా, నిఫ్టి టాప్‌ లూజర్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కావడం విశేషం. ఇవాళ వీక్లీ సెటిల్‌మెంట్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లను నిఫ్టి పట్టించుకుంటుందా అన్నది చూడాలి. లాభాల్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు దాదాపు అర శాతం నష్టంతో ఉన్నాయి. మరి మన మార్కెట్లు ఎలా ముగుస్తాయో చూడాలి.