For Money

Business News

17,700పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. వంద పాయింట్ల లాభంతో 17,729 పాయింట్ల స్థాయిని తాకింది. బ్యాంక్‌ నిఫ్టి నుంచి ఇవాళ కూడా నిప్టికి గట్టి మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టి 0.96 శాతం లాభంతో 38,000ని దాటింది. వరుసగా రెండో రోజు కూడా లాభాలతో ట్రేడవుతోంది. చాలా రోజుల తరవాత ఈ షేర్‌లో మూవ్‌మెంట్‌ వచ్చింది. ఈ స్థాయిలో నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వస్తుందా లేదా కన్సాలిడేట్‌ అవుతుందా చూడాలి. విదేశీ ఇన్వెస్టర్లు, రీటైల్‌ ఇన్వెస్టర్ల మద్దతుగా నిఫ్టి పరుగులు పెడుతోంది. కంపెనీల పనితీరుతో సంబంధం లేకుండా లిక్విడి ఆధారంగా నిఫ్టి పెరుగుతోంది. ముఖ్యంగా చైనా మార్కెట్‌ పడటం మన మార్కెట్లకు పాజిటివ్‌గా మారింది. అనేక కీలక రంగాలు.. ముఖ్యంగా టెక్నాలజీ రంగాలు అనూహ్య స్థాయికి చేరడంతో చైనా కొరడా ఝళిపించింది. అసాధారణ లాభాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని చైనా భావిస్తోంది. ముఖ్యంగా మెటల్స్‌ ధరలు బాగా తగ్గేలా చర్యలు తీసుకంది. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ నుంచి భారత్‌కు నిధులు వస్తున్నాయని… కాబట్ట ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐటీసీ 235.50 2.06 ఎస్‌బీఐ 471.35 1.65
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,145.50 1.29
ఎస్‌బీఐ లైఫ్‌ 1,198.50 1.15
ఐషర్‌ మోటార్స్‌ 2,890.15 1.05

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా స్టీల్‌ 1,428.45 -0.58
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 687.00 -0.36
కోల్‌ ఇండియా 162.00 -0.18
ఇన్ఫోసిస్‌ 1,699.35 -0.17
సిప్లా 953.45 -0.06