NIFTY TRADE: కొత్త రికార్డుల గుబులు
విదేశీ ఇన్వెస్టర్ల జోరు ముందు సాధారణ ఇన్వెస్టర్లు కంగారు పడిపోతున్నాడు. నిఫ్టి రోజుకో కొత్త శిఖరాన్ని అధిరోహిస్తోంది. పెట్టుబడి పెట్టాలంటే గుబులు. పెట్టకపోతే.. నిఫ్టి పరుగులు పెడుతోంది. నిన్న బ్యాంక్ నిఫ్టిట 37200 కాల్ ఆప్షన్ రూ. 42 నుంచి రూ. 270 దాకా పెరిగిందంటే… గోల్డన్ ఛాన్స్ మిస్సయినట్లే. కాని విదేశీ ఇన్వెస్టర్ల గేమ్‌లో బలౌతామేమో అన్న బెంగ అధికంగా పీడిస్తోంది. సీనియర్ అనలిస్టులు అందుకే చిన్న ఇన్వెస్టర్లను మార్కెట్‌కు దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారు. ఇక ఇవాళ్టి పొజిషన్స్‌కు వస్తే… సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 17,629. అంటే ఓపెనింగ్‌లోనే 17,725ని దాటాలన్నమాట. కాని టెక్నికల్‌గా చూస్తే నిఫ్టికి 17,684 దాటడం కష్టంగా ఉంది. ఎందుకంటే తొలి ప్రతిఘటన ఇదే స్థాయిలో ఉంది. ఒకవేళ నిఫ్టి గనుక 17,725ని దాటితే ట్రేడింగ్‌కు దూరంగా ఉండటమే బెటర్. ఒకవేళ నిఫ్టి 17,720 లోపల వస్తే 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అమ్మండి. వ్యూహం పనిచేయకపోతే 15 పాయింట్ల నష్టంతో మార్కెట్ నుంచి తప్పుకోండి. టెక్నికల్ కూడా బై సిగ్నల్ ఇస్తున్నా… నిఫ్టి ఓవర్ బాట్‌లో ఉందని హెచ్చరిస్తోంది. 17,680పైన నిఫ్టి నిలబడకపోతే 17650, ఆతరవాత 17,600 దిగువకు రావడం ఖాయం. ఎక్కడా కొనుగోలుకు ఛాన్స్ లేదు. చిన్న ఇన్వెస్టర్లకు ముఖ్యంగా ఆప్షన్స్‌లో ట్రేడ్ చేసేవారు మార్కెట్‌కు దూరంగా ఉండండి.
నిఫ్టి సాంకేతిక అంశాలు వివరించే ప్రయత్నం ఇది. నిపుణుల ఇచ్చిన సపోర్ట్, రెసిస్టెన్స్ లెవల్స్ మాత్రమే ఇవి. మార్కెట్‌పై అవగాహన రావడం కూడా ఇచ్చిన విశ్లేషణ. పెట్టుబడి పెట్టే ముందు మాత్రం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సలహా తప్పక తీసుకోండి.