For Money

Business News

17,600పైన నిఫ్టి… నిలబడేనా?

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ఇవాళ 17,620 వద్ద ప్రారంభమైంది. 17,639ని తాకిన తరవాత 17600 వద్దకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 111 పాయింట్ల లాభంతో 17622 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఇపుడు 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి గనుక 17600పైన గట్టిగా నిలబడితే… స్వల్పకాలిక ర్యాలీకి ఛాన్స్‌ ఉంది. ఈ వారంలో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశముంది. వడ్డీ రేట్ల విషయంలో ఫెడ్‌ ఇపుడున్న పరిస్థితినే కొనసాగిస్తే…నిఫ్టి 18500ని దాటొచ్చు. కాని పెరుగుతున్న క్రూడ్‌ ధరలు భారత మార్కెట్‌కు ప్రతికూలమే. అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలు పెంచుకున్నా… ప్రస్తుత ధరల వద్ద కూడా అనేక కంపెనీలు ప్రతికూల ఫలితాలు చూపే ప్రమాదముంది. అయితే ఇదంతా జనవరిలో. ఈలోగా నిఫ్టిని 18000ని దాటుతుందేమో చూడాలి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 17600 దిగువకు వస్తే నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు సుదర్శన్‌ సుఖాని రెకమెండ్‌ చేస్తున్నారు. అయితే 17400 స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. మరి మిడ్ సెషన్‌లోగా నిఫ్టిలో ఆ ఛాన్స్‌ వస్తుందేమో చూడాలి. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు ఈనెలలో ప్రతిరోజూ అమ్ముతున్నారు. ఒక్క డిసెంబర్‌ నెలలోనే ఇప్పటి వరకు వీరి నికర అమ్మకాలు రూ.8000 కోట్లను దాటాయి. కాబట్టి నిఫ్టి 17,600పైన నిలబడుతుందేమో చూడాలి.