For Money

Business News

17,800పైన ప్రారంభమైన నిఫ్టి

నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి వద్ద ప్రారంభమైంది. ఆరంభంలోనే 17,833 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి ప్రస్తుతం 104 పాయింట్ల లాభంతో 17,776 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 17,740పైన ఉన్నంత వరకు నిఫ్టి పరవలేదు. ఈ స్థాయిని కోల్పోతే ఒక మోస్తరు ఒత్తిడి రావొచ్చని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టితో పాటు ఇతర సూచీలన్నీ గ్రీన్లో ఉన్నాయి. మిడ్ క్యాప్‌ నిఫ్టి కూడా 0.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా హాంగ్‌సెంగ్ ఒకటిన్నర శాతం నష్టంతో ఉన్నందున… నిఫ్టి మిడ్‌ సెషన్‌ వరకు ఎలా ఉంటుందో చూడాలి. ఐటీతో పాటు రియల్‌ ఎస్టేట్‌ కౌంటర్లకు మంచి మద్దతు లభించింది. నిఫ్టిలో 35 షేర్లు ఇపుడు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టికి 17,840 తుదపరి గట్టి ప్రధాన నిరోధంగా మారే అవకాశముంది.