For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

పడితే కొనుగోలు చేయొచ్చు కూడా. రివ్యూ చదివే ముందు ఓ క్లారిటీ. టెక్నికల్‌ సంకేతాలన్నీ సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ఇవాళ నిఫ్టి వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌కు క్లోజింగ్‌. నిన్న మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి భారీగా కోలుకోవడానికి కారణం ఇవాళ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉండటమే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నిఫ్టి కదలికలను చూడండి. నిఫ్టి క్రితం ముగింపు 15,709. నిఫ్టి ఇదే స్థాయి లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కావొచ్చు. ఆసియా మార్కెట్ల ఊపుతో నిఫ్టి పెరుగుతుందేమో చూడండి. 15,700పైన కొనుగోళ్ళ మద్దతు లేదా షార్ట్‌ కవరింగ్‌ వస్తే నిఫ్టి 15,800 దాకా వెళ్ళొచ్చు. పడితే వెంటనే 15,660 ప్రాంతానికి చేరుతుంది. ఇక్కడ బలహీనంగా ఉంటే 15620కి చేరడం ఖాయం. సో…నిఫ్టి కదలికను బట్టి పొజిషన్‌ తీసుకోండి. 15800 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. కొనేవాళ్ళు మాత్రం 15,620 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్‌ 15,595. ఆసియా మార్కెట్ల ఉత్సాహం యూరో మార్కెట్లలో కూడా కన్పించే అవకాశముంది. అనూహ్యంగా మంత్లి డెరివేటివ్స్‌ రోజున ప్రపంచ మార్కెట్లు పాజటివ్‌గా మారినందున… రోల్‌ ఓవర్స్‌ బాగుండొచ్చు. సో…. ఇరువైపులా ఛాన్స్‌ ఉంది.