For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

వడ్డీ రేట్లను పెంచడం  లేదని అమెరికా కేంద్ర బ్యాంక్‌ స్పష్టం చేసింది. అలాగే విద్యా రంగానికి చెందిన కంపెనీలపై కొత్త ఆంక్షల కారణంగా అమెరికా టెక్‌ కంపెనీల్లో కలకలల రేగింది. అనేక కంపెనీలు భారీగా నష్టపోయాయి. దీంతో చైనా అధికారులు ఇపుడు జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల పెద్దగా ప్రభావం ఉండదని, ఇప్పటికీ తమ షేర్ల విలువ ఆకర్షణీయంగా ఉందని చైనా అధికారులు వివరణ ఇచ్చారు. చైనా వివరణతో ఆ దేశ స్టాక్ మార్కెట్లతో పాటు హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్‌ గ్రీన్‌లో ముగిస్తే మిగిలిన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు ఒకశాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ ఏకంగా 2 శాతంపైగా లాభంతో ఉంది. జపాన్‌ నిక్కీ అరశాతంపైగా లాభంతో ఉంది. థాయ్‌ల్యాండ్‌ తప్ప అన్నీ గ్రీన్‌. సింగపూర్ నిఫ్టి మాత్రం స్థిరంగా ఉంది. డాలర్‌ స్వల్పంగా తగ్గినా… క్రూడ్‌ 75 డాలర్లను దాటింది. ఈ నేపథ్యంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. కార్పొరేట్‌ ఫలితలు మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టి కన్నా షేర్లలో ఇవాళ ట్రేడింగ్‌ చురుగ్గా సాగే అవకాశముంది. ఇవాళ, వీక్లీ… జులై నెల డెరివేటివ్స్‌కు క్లోజింగ్‌.