For Money

Business News

NIFTY TRADE:16,655 కీలకం

ఇవాళ ఆగస్ట్‌ వీక్లీ, డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ప్రపంచ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లయితే భారీ నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్‌ మళ్లీ 71 డాలర్లను దాటింది. ఈ నేపథ్యంలో కూడా సింగపూర్ నిఫ్టి దాదాపు ట్రేడవుతోంది. నిఫ్టికి ఇవాళ 16,555 కీలకం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16,634. ఇక్కడి నుంచి నిఫ్టికి ఉన్న లెవల్స్‌ గమనించండి. నిఫ్టి 16,655ని దాటుతుందేమో చూడండి. దాటితే 16,680 వరకు ఆగండి. ఈ స్థాయిని దాటితే 16,690-16,700 స్టాప్‌లాస్‌తోఅమ్మండి. ఇకవేళ నిఫ్టి పడితే.. 16,600 స్థాయికి వస్తుందేమో చూడండి. వస్తే ఆగండి. ఎందుకంటే నిఫ్టి16,580ని కోల్పోతే.. 16,560ని తాకొచ్చు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 16,560 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. అయితే 15,560 దిగువకు వస్తే నిఫ్టిపై బేర్‌ ఆపరేటర్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొనుగోలుకు దూరంగా ఉండండి. దిగువకు వచ్చి… మళ్ళీ ఈ స్థాయిని దాటితే స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయండి. 15,560-15,680 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముంది. రిస్క్‌ వొద్దనే ఇన్వెస్టర్లు ఇవాళ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.