NIFTY TRADE: పెరిగితే అమ్మడమే
చైనా సమస్యలు దాదాపు సమసినట్లే. అంతర్జాతీయ మార్కెట్లన్నీ స్తబ్దుగా ఉన్నాయి. పెరగడానికి లేదా తగ్గడానికి ఒక ట్రిగ్గర్ కోసం ఎదురు చూస్తున్నాయి. అధిక స్థాయిలో నిఫ్టికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎందుకంటే నిఫ్టి పెరిగే కొద్దీ కొత్త ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ స్థాయిలో నిఫ్టి కొద్ది కొద్దిగా పెరుగుతుంది. కాని పడటం చాలా స్పీడుగా ఉంటుంది. నిఫ్టిలో స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మడం బెటర్. నిఫ్టి క్రితం ముగింపు 17855. సింగపూర్ నిఫ్టి స్థాయిలో పెరిగితే ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17900ని దాటొచ్చు. నిన్నటి మాదిరే ఇవాళ కూడా నిఫ్టికి 17940 ప్రధాన నిరోధంగా ఉంటుంది. ఓపెనింగ్ నుంచి ఈ నిరోధ స్థాయిలో నిఫ్టిని అమ్మవచ్చని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి ఇవాళ కూడా నిన్నటి కనిష్ఠ స్థాయి 17800ని తాకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎల్లుండి ఈ నెల, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున… నిఫ్టి కదలికలను జాగ్రత్తగా గమనించండి.