For Money

Business News

రూ. 25 లక్షల దాకా రుణం

అమెజాన్‌ ఇండియా మార్కెట్‌ప్లేస్‌లో నమోదైన వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలకు రూ.25 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ (ఓడీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో కరెంటు ఖాతా ఉన్న వ్యాపారులు తమ నిర్వహణ మూలధన అవసరాల కోసం దీన్ని వాడుకోవచ్చని బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఈ మేరకు అమెజాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. రుణ వితరణ పూర్తి ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని బ్యాంక్‌ పేర్కొంది. ఎంఎస్‌ఎంఈలు వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం కోసం ఇది ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొంది.