For Money

Business News

మద్దతు స్థాయి కోల్పోయిన నిఫ్టి

నిఫ్టిని యూరో మార్కెట్లు దారుణంగా దెబ్బతీశాయి. ఉదయం ఒక మోస్తరు లాభాలతో 16140 పాయింట్లను తాకిన నిఫ్టి యూరో మార్కెట్ల ఓపెనింగ్‌ తరవాత నష్టాల్లోకి జారుకుంది. సెషన్‌ కొనసాగే కొద్దీ యూరో మార్కెట్ల నష్టాలు పెరగడంతో నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఒకదశలో 15950ని తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో 15966 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 180 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 92 పాయింట్లు క్షీణించింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి భారీగా నష్టపోయింది. దీని ప్రభావం నిఫ్టిపై అధికంగా ఉంది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం 0.79 శాతం లాభంతో ముగిసింది. దీనికి ప్రధాన కారణం అరబిందో ఫార్మా, లారస్‌ ల్యాబ్‌ ఆకర్షణీయ లాభాల్లో ముగియడం. కరోనా కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫార్మా షేర్లకు మళ్ళీ డిమాండ్‌ వస్తోంది. దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలించింది. నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం స్థిరంగా ముగిసింది.