For Money

Business News

పవర్‌ మెక్‌ కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాద్‌లో మాదాపూర్‌లో ఉన్న పవర్‌ మెక్‌ ఆఫీస్‌లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ కార్పొరేట్‌ కార్యాలయంలో పవర్‌ మెక్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ (Power Mech Infra Ltd), పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ (Power Mech Projects Ltd)  ఆఫీసు కూడా ఉంది. ఈ రెండు కంపెనీలపై ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దేశంలోని ఇతర నగరాల్లో ఈ కంపెనీకి ఉన్న ఆఫీసుల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పాదక, ఐటీ, ఇన్‌ఫ్రా, మైనింగ్ రంగాల్లో విస్తరించిన ఈ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టింది. మనదేశంతో పాటు సౌదీ దేశాల్లో ఈ కంపెనీ ప్రాజెక్టులను నెలకొల్పింది. ట్యాక్స్ చెల్లింపులపై అవకతవకల జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ కంపెనీకి సజ్జా కిషోర్‌బాబు ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.