For Money

Business News

16100పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టికన్నా కాస్త అధిక లాభంతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16139 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16121 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 63 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్‌ ధర 100 డాలర్ల దిగువకు రావడంతో ఈ రంగంతో ముడిపిన షేర్లు పెరిగాయి. బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇదే కారణంగాతో ఓఎన్‌జీసీ రెండు శాతం నష్ట పోయింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆర్థిక ఫలితాలతో మార్కెట్‌ అసంతృప్తితో ఉంది. అయితే షేర్‌ మాత్రం కేవలం 2 శాతం క్షీణించింది. చూస్తుంటే ఈ షేర్‌ నష్టాల నుంచి బయటపడే అవకాశముంది. నిఫ్టితో పాటు ఇతర సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ గ్రీన్‌ టాప్‌ గెయినర్‌ కాగా, మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలో హెచ్‌పీసీఎల్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐటీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. ఇవాళ చాలా మంది బ్రోకర్లు డిక్సన్‌ టెక్నాలజీస్‌ను రెకమండ్‌ చేశారు. కాని ఈ షేర్‌ నష్టాలతో ప్రారంభమైంది. 0.33 శాతం నష్టంతో ఉంది. మరి ఈ షేర్‌ లాభాల్లోకి వస్తుందేమో చూడాలి. నిఫ్టి బ్యాంక్‌లో ఎస్‌బీఐ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.