For Money

Business News

నిఫ్టి: లాభాలన్నీ కరిగిపోయే

ఉదయం ఓపెనింగ్‌లోనే 18,210ని తాకిని నిఫ్టికి మిడ్‌ సెషన్‌లోపే ఒత్తిడి ఎదురైంది. మిడ్‌ సెషన్‌కల్లా నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. తరవాత కోలుకున్నా… పై స్థాయిలో నిలబడలేకపోయింది. ఒకదశలో 18,071కి క్షీణించింది. ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు 18,070 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభించడంతో క్లోజింగ్‌కల్లా 18,109 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 7 పాయింట్లు పెరిగింది. ఇవాళ ఉదయం ఒక శాతం దాకా లాభం పొందిన బ్యాంక్‌ నిఫ్టి లాభాలన్నీ కరిగిపోయాయి. మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం 0.43 శాతం పెరిగింది. బేటా అధికంగా ఉన్న షేర్లలో ఇవాళ పెద్ద యాక్టివిటీ లేదు. పవర్‌గ్రిడ్‌ ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మిడ్ క్యాప్‌ సూచీ కూడా మిడ్‌ సెషన్‌లో నష్టాల్లోకి జారుకున్నా… ఆ తరవాత కోలుకుని లాభాల్లో ముగిసింది. మిడ్‌ సెషన్‌లో ఐఆర్‌సీటీసీ 5 శాతం లాభంతో ముగిసింది.