For Money

Business News

ఐటీ కూడా కాపాడలేకపోతోంది

టీసీఎస్‌ ఫలితాలు, ఇన్ఫోసిస్‌ బై బ్యాక్‌తో ఉత్సాహం ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలహీనపడ్డాయి. యూరో మార్కెట్లపై ఆశతో మిడ్‌సెషన్‌లో స్వల్పంగా కోలుకున్నా… ఆ ఆశ ఎక్కువసేపు నిలబడలేదు. యూరో మార్కెట్లు కూడా అరశాతంపైగా నష్టంతో ట్రేడవడం, అమెరికా ఫ్యూచర్స్‌దీ అదే పరస్థితి కావడంతో నిఫ్టి 17102కు పడిపోయింది. గరిష్ఠ స్థాయి నుంచి 140 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే 138 పాయింట్లు నష్టపోయింది. ఉదయం ఆశరేపిన విప్రో వంటి ఐటీ షేర్లు కూడా క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. టీసీఎస్‌ ఒక శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌ రెండు శాతం నష్టపోయాయి. నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. క్రూడ్‌ ధరలు తగ్గడం, రూపాయి స్థిరంగా ఉండటంతో ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కొన్ని బ్యాంకులు మార్కెట్‌కు గట్టి మద్దతు ఇస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే… యూరో, అమెరికా ఫ్యూచర్స్‌ కీలక పాత్ర పోషించానున్నాయి. ఆ మార్కెట్లు కోలుకుంటే… నిఫ్టి కూడా లాభాల్లోకి రావొచ్చు. లేదంటే ఒత్తిడి కొనసాగే పరిస్థితి కన్పిస్తోంది.