For Money

Business News

MID SESSION: కొనసాగుతున్న లాభాల స్వీకరణ

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు స్వీకరణ కొనసాగుతోంది. ఉదయం ఊహించినట్లే 18300 ప్రాంతానికి వచ్చి… భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. 18,314 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్‌సెషన్‌లో భారీ ఒత్తిడికి లోనైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 107 పాయింట్ల నష్టంతో 18,071 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి 250 పాయింట్లు క్షీణించింది. ఇక మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా 1.35 శాతం నష్టపోతే… నిఫ్టి తరువాతి స్థాయి సూచీ అయిన నిఫ్టి నెక్ట్స్‌ 1.8 శాతం నష్టపోయింది. కేవలం బ్యాంకులు మాత్రమే నిఫ్టికి కాస్త మద్దతుగా ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ ఇవాళ మరో రెండున్నర శాతం క్షీణించింది. ఎంఫసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి షేర్లు నష్టాల్లో ముందున్నాయి. నిఫ్టికి తుదపరి మద్దతు స్థాయి 18030. ఈ స్థాయి దాటితే 17975కి చేరొచ్చు.