For Money

Business News

స్థిరంగా స్టాక్‌ మార్కెట్లు

ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం17800ని తాకిన నిఫ్టి ఆ తరవాత స్వల్పంగా తగ్గినా..వెంటనే కోలుకని 17,839కి చేరింది. యూరో మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితం కావడంతో నిఫ్టి కూడా 17,775 ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 76 పాయింట్లు లాభపడింది. నిఫ్టిలో 36 షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టితో పాటు ఇతర ప్రధాన సూచీలు కూడా గ్రీన్‌లో ఉన్నా… బ్యాంక్‌ నిఫ్టి అతి తక్కువగా 0.25 శాతం.. అత్యధికంగా నిఫ్టి నెక్ట్స్‌ 0.91 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ మిడ్‌ సెషన్‌కల్లా మారిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఏకంగా 4 శాతం పైగా లాభపడి నిఫ్టి షేర్లలో టప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాత ఐషర్‌ మోటార్స్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటోకార్ప్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లో హిందాల్కో ముందుంది.ఈ షేర్‌ రెండు శాతంపైగా నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 10 శాతంపైగా పెరగడంతో నిఫ్టి నెక్ట్స్‌ జోరు మీద ఉంది. ఈ సూచీలో ఇంకా బాష్‌, జొమాటో షేర్లు 3.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ముతూట్‌ ఫైనాన్స్‌ 12 శాతంపైగా నష్టపోయింది. ఆస్ట్రాల్‌ కూడా ఇవాళ మూడు శాతం నష్టపోయింది. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు వాటా ఉన్న షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్ప నష్టాలతో ఉన్నందున.. మార్కెట్‌ స్థిరంగా ముగిసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.