For Money

Business News

17800పైన ముగిసిన నిఫ్టి

ఇవాళ మార్కెట్‌లో అనేక షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫలితాలు బాగున్న షేర్లకు మంచి డిమాండ్‌ లభించింది. నిఫ్టి ఇవాళ 17825 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 127 పాయింట్లు లాభపడింది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉండటం, అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్‌ స్థిరంగా ఉండటంతో రోజంతా నిఫ్టి లాభాల్లో కొనసాగింది. అనేక మంది అనలిస్టులు నిఫ్టి తదుపరి టార్గెట్ 178200గా చెప్పడంతో… ఎక్కడా అమ్మకాల ఒత్తిడి రాలేదు. నిఫ్టిలో42 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయంటే మార్కెట్‌ ఎంత పటిష్ఠంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు కొంటూనే ఉన్నారు. ఇవాళ హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు బాగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ దాదాపు 5 శాతం లాభంతో నిఫ్టి గెయినర్స్‌లో టాప్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 12 శాతం దాకా లాభపడి నిఫ్టి నెక్ట్స్‌లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇవాళ రూ.1500 స్థాయిని దాటింది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ అన్నీ రెండు నుంచి నాలుగు షేర్ల వరకు లాభపడ్డాయి. పెరిగినట్లే కన్పించిన ఎల్‌ఐసీ మళ్ళీ రూ.700లోపే ముగిసింది. ఇవాళ స్టార్‌ షేర్‌ బాటా. రూ. 59.55 పెరిగి రూ. 1971 వద్ద ముగిసింది. ఈ రంగంలో మరో ప్రధాన షేర్‌గా ఎదుగుతున్న మెట్రో బ్రాండ్స్‌లో ఇవాళ భారీ ఒత్తిడి వచ్చినా.. తట్టుకుని రూ.10 నష్టంతో రూ. 844 వద్ద ముగిసింది. రాకేష్‌ మృతితో ఈ కౌంటర్‌లోఒత్తిడి పెరిగింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బాగా తగ్గడంతో ఈ రంగంతో ముడిపడి ఉన్న అనేక షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ మళ్ళీ రూ. 310ని దాటడం విశేషం.