For Money

Business News

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

బ్యాంకు షేర్లు కాపాడకుంటే… నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. ఒకదశలో 17,700 దిగువకు వెళ్ళిన చివర్లో కాస్త కోలుకున్నా … నష్టాలు తప్పలేదు. ఉదయం నిఫ్టి ఆల్గో లెవల్స్‌ ప్రకారం 17,945 వద్ద గట్టి ప్రతిఘటన వచ్చింది. ఓపెనింగ్‌లోనే ఈ ఒత్తిడి రావడంతో నిఫ్టి రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ కావడం, రేపు మార్కెట్‌ సెలవు కావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. వీక్లీ డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్‌లు ఇవాళ ఉదయం 17900పైన ఇన్వెస్టర్లు స్క్రేర్‌ ఆఫ్‌ చేసుకున్నారు. దీంతో నిఫ్టిఇ ఎక్కడా మద్దతు అందలేదు. ఎట్టకేలకు క్లోజింగ్‌లో 17,730 స్థాయిని కాపాడుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 133 పాయింట్లు క్షీణించి 17,766 వద్ద ముగిసింది. నిఫ్టికన్నా మిడ్‌ క్యాప్‌ నిఫ్టి భారీగా క్షీణించింది. సూచయీ 1.7 శాతం క్షీణించింది. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.4 శాతం క్షీణించింది. నిఫ్టిలో కేవలం ఏడు షేర్లు మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. టాటా మోటార్స్‌ 4 శాతం నష్టపోయింది.