For Money

Business News

ఫ్యూచర్స్‌పై ఆశ: స్థిరంగా ముగిసిన నిఫ్టి

ఉదయం ఆరంభంలోనే మార్కెట్‌ ఇన్వెస్టర్లకు షాక్‌ ఇచ్చింది. సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా గ్రీన్‌లో ప్రారంభమైన నిప్టి పావు గంటలోనే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16444 స్థాయికి చేరింది. అక్కడి నుంచి క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మిడ్‌సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చింది. యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కావడమే దీనికి ప్రధాన కారణం.16610ని తాకిన తరవాత నిఫ్టి అక్కడి నుంచిపైకి కదల్లేకపోయింది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక శాతంపైగా లాభంతో ఉండటంతో నిఫ్టి స్థిరంగా ముగిసింది. గత శుక్రవారం రెండున్నర శాతం నష్టంతో ముగిసిన అమెరికా మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం కావొచ్చు. దీంతో నిఫ్టి నష్టాల్లో జారకుండా 16550పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 15 పాయింట్ల నష్టంతో 16569 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌ గ్రీన్‌లో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ స్వల్ప నష్టంతో ముగిసినా.. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ మాత్రం 0.64 శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ ఒక రంగమంటూ కాకుండా అన్ని ప్రధాన కంపెనీలు న్యూస్‌ ఆధారంగా స్పందించాయి. ఆటో డేటా కారణంగా బజాజ్‌ ఆటో 4 శాతంపైగా లాభంతో ముగిసింది. టూ వీలర్స్‌ విభాగంలో హీరో తన స్థానాన్ని కోల్పోతోంది. దీంతో ఈ షేర్‌ నష్టాలతో ముగిసింది. సిమెంట్‌ రంగ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. శ్రీసిమెంట్‌ రూ. 20000 దిగువన ముగిసింది. చమురు ధరలు పెరిగినందున ఏషియన్‌ సిమెంట్స్‌ రెండున్నర శాతం నష్టంతో ముగిసింది.