For Money

Business News

చైనా వస్తువులపై ‘ట్రంప్‌ సుంకాల’ ఎత్తివేత?

దేశంలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరడంతో సామాన్య ప్రజలకు ఊరట కల్గించే అంశాలను బైడెన్‌ పరిశీలిస్తోంది. దేశీయ పరిశ్రమను రక్షించడానికని ట్రంప్‌ ప్రభుత్వం చైనాకు చెందిన దాదాపు 30,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై సుంకం విదించారు. ట్రంప్‌ అనుకున్నట్లు దీనివల్ల అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు లబ్ది పొందాయి. అయితే అధిక ధరలతో సతమతమౌతున్న సామాన్య ప్రజలను ఆదుకునేందుకు ఈ ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని బైడెన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల అమెరికాలో తక్కువ ధరకే అమెరికా వస్తువులు లభిస్తాయి. ఈ విషయాన్ని ఆ యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ జినా రైమాండో సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకు కొన్ని తాము ప్రతిపాదనలు తయారు చేశామని రైమాండో వివరించారు. దేశీ పరిశ్రమలను కాపాడే లక్ష్యంతో స్టీలు, అల్యూమినియం వంటి వాటిపై ఆంక్షలు కొనసాగించాలని సూచించినట్టు తెలిపారు. అయితే పుడ్‌, సైకిళ్లు వంటి విభాగాల్లో ఆంక్షలు సడిలించే అంశాన్ని పరిశీలించాలని కోరినట్టు వెల్లడించారు. అయితే తాము కేవలం సూచనలు మాత్రమే చేశామని, తుది నిర్ణయం అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకుంటారని రైమాండో వెల్లడించారు.