For Money

Business News

నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఇవాళ కూడా స్టాక్‌ మార్కెట్‌ పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు అనుగుణంగా కదలాడింది. ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 17150 – 16900 పాయింట్ల మధ్య కదలాడింది. ఉదయం ఆరంభంలోనే 17155ని తాకిన నిఫ్టి తరవాత క్రమంగా క్షీణిస్తూ మిడ్‌ సెషన్‌కు ముందే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16,909ని తాకింది. మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి కోలుకుని దాదాపు క్రితం స్థాయి వద్దకు చేరింది. తరవాత క్లోజింగ్‌లో లాభాల స్వీకరణతో 69 పాయింట్ల నష్టంతో 17,003 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ యూరో, అమెరికా మార్కెట్లకు సెలవు. యూరో ప్రీ మార్కెట్‌ సూచీలు 0.3 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు పడ్డాయి. ఈ సూచీ 1.1 శాతం క్షీణించగా, నిఫ్టి బ్యాంక్‌ 0.95 శాతం తగ్గాయి. ఇవాళ టెక్నాలజీ షేర్లకు మంచి మద్దతు లభించింది.