For Money

Business News

నిలకడగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఉన్నా.. మన మార్కెట్లు నిలకడగా ముగిశాయనే చెప్పాలి. క్లోజింగ్‌ ముందే ఏకంగా గ్రీన్‌లోకి వచ్చిన నిఫ్టి.. చివరల్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా స్వల్ప నష్టంతో ముగిసింది. మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లోఉన్న నిఫ్టి క్రమంగా కోలుకుంటూ 2 గంటలకల్లా లాభాల్లోకి వచ్చింది. 16,248 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి.. 16216 పాయింట్ల వద్ద ముగిసింది. కేవలం నాలుగు పాయింట్ల నష్టంతో ముగిసింది. క్లోజింగ్‌కల్లా టాప్ గెయినర్స్ జాబితా మారిపోయింది. ఐషర్‌ మోటార్స్‌ నాలుగు శాతం లాభంతో టాప్‌లోకి వచ్చింది.ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ ఉంది. టీసీఎస్‌ ఐటీ షేర్ల పతానానికి నాయకత్వం వహించింది. నిఫ్టి ఐటీ షేర్లతో పాటు మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఇవాళ నిఫ్టి నెక్ట్స్‌ ఏకంగా 1.5 శాతం పైగా లాభపడటం విశేషం. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌ షేర్లు. అదానీ గ్రీన్‌ దాదాపు 16 శాతం, అదానీ ట్రాన్స్‌ మిషన్‌ 4.76 శాతం లాభపడ్డాయి. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజస్‌ కూడా 3 శాతంపైగా లాభపడింది.