For Money

Business News

రెండు శాతం నష్టాల్లో నాస్‌డాక్‌

ఆరంభంలో భారీ నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్‌ స్వల్పంగా కోలుకుంది.అయినా నాస్‌డాక్‌ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.94శాతం, డౌజోన్స్‌ 0.34 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా టెక్‌ షేర్లలోనష్టాలు భారీగా ఉన్నాయి. డీల్‌ నుంచి ఎలాన్‌ మస్క్‌ వెనక్కి తగ్గడంతో ట్విటర్‌ షేర్‌ పది శాతం తగ్గింది. టెస్లా 5 శాతం క్షీణించింది. అమెజాన్‌ మూడు శాతం తగ్గింది. పదేళ్ళ ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌ 3 శాతం తగ్గినా… డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరడంతో ఇతర మార్కెట్లు కూడా క్షీణించింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 107.8 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ భారీగా పెరగడంతో క్రూడ్‌ రెండు శాతం దాకా తగ్గింది. అలాగే బులియన్‌ మార్కెట్‌లో కూడా డల్‌గా ఉంది.