For Money

Business News

ఆగని రూపాయి పతనం

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతోంది. నిన్న ఫారెక్స్‌ మార్కెట్‌లో మరో 19 పైసలు క్షీణించి 79.45 వద్ద ముగిసింది. ఇది కొత్త ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్‌లో నిన్న డాలర్‌తో రూపాయి 79.3 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో బలనడి 79.24 స్థాయికి చేరినా… తరవాత 79.50 వద్దకు పతనమైంది. చివరకు 79.45 వద్ద క్లోజైంది. శుక్రవారం 79.26 వద్ద ఉన్న విషయం తెలిసిందే. దీంతో 19 పైసలు నష్టపోయినైట్టెంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో అన్ని కరెన్సీలు భారీగా క్షీణిస్తున్నాయి. ఫెడ్‌ మళ్ళీ వడ్డీ రేట్లను పెంచతున్న నేపథ్యంలో డాలర్‌కు విపరీత గిరాకి ఏర్పడుతోంది.