For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

కొద్దిసేపు మినహా రోజంతా నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. ఆరంభంలో నష్టపోయి 18,119 స్థాయిని తాకిన నిఫ్టి… ఆ తరవాత క్రమంగా కోలుకుంటూ వచ్చింది. ఒకట్రెండు సార్లు ఒత్తిడి వచ్చినా నిలదొక్కుకుంది. మిడ్‌సెషన్‌ ప్రారంభమైన యూరో మార్కెట్ల దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడ్‌ కావడంతో నిఫ్టి కోలుకుని క్లోజింగ్‌ ముందు గ్రీన్‌లోకి వచ్చింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 18286ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే కేవలం 2 పాయింట్ల నష్టంతో 18255 వద్ద ముగిసింది. నిన్న ఒత్తిడికి లోనైన ఐటీ ఫ్రంట్‌లైనర్స్‌కు ఇవాళ కాస్త మద్దతు లభించింది. మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో 20 షేర్లు గ్రీన్‌లో ఉంటే 30 షేర్లు రెడ్‌లో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌లోని టాప్‌ గెయినర్స్‌ చాలా వరకు పీఎస్‌యూ షేర్లే ఉన్నాయి.