For Money

Business News

బయోకాన్‌ చేతికి మైలాన్‌ బయోసిమిలర్‌?

బయోసిమిలర్‌ రంగంలో అతి పెద్ద డీల్‌కు రంగం సిద్ధమౌతోంది. బయోకాన్‌కి చెందిన బయోకాన్‌ బయోలాజిక్స్‌లో మైలాన్‌కు వాటా ఉంది. ఈవాటాను కొనాలని బయోకాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు చర్చలు చివరి దశకు చేరినట్లు సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. మైలాన్‌ వాటా కొనాలంటే బయోకాన్‌కు150 కోట్ల డాలర్లు కావాలి. మైలాన్‌ (ఇపుడు దీని పేరు వయట్రిస్‌)కు కూడా రుణాల చెల్లింపు కోసం నిధులు కావాలి. దీంతో బయోకాన్ బయోలాజిక్స్‌లో ఉన్న వాటా అమ్మడానికి రెడీ అయింది. తాజా లెక్క ప్రకారం బయోకాన్‌ బయోలాజిక్స్‌ కంపెనీ వ్యాల్యూయేషన్‌ 1000 కోట్ల డాలర్లు లెక్కిస్తున్నారు. మైలాన్‌కు ఇవ్వాల్సిన 150 కోట్ల డాలర్లలో 100 కోట్ల డాలర్లను విదేశాల నుంచి రుణం రూపంలో సమీకరించాలని బయోకాన్‌ భావిస్తోంది. మిగిలిన 50 కోట్ల డాలర్లను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు కొంత వాటా అమ్మాలని భావిస్తోంది. ఈ డీల్ తరవాత సీరమ్‌ కాస్త వాటా పెరిగినా.. మెజారిటీ వాటా బయోకాన్‌కే ఉంటుంది.