For Money

Business News

18,300పైన ముగిసిన నిఫ్టి

ఉదయం ఒక గంట పాటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి తరవాత క్రమంగా గ్రీన్‌లోనే ఉంటూ వచ్చింది. మిడ్‌సెషన్‌లో చిన్న ఝలక్‌ ఇచ్చినా.. వెంటనే కోలుకుంది. యూరోపియన్‌ మార్కెట్‌ గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి చివరిదాకా లాభాలను కాపడుకుంటూ వచ్చింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలను మార్కెట్‌ తిరస్కరించింది. రెండు షేర్లు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ దాదాపు ఆరు శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో 34 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆటో, సిమెంట్‌ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. ఐటీ, మెటల్స్‌లో ఒత్తిడి కన్పించింది.ఉదయం 18288ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుని…18321 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 18,308 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి నష్టాల్లో క్లోజ్‌ కాగా, మిడ్‌ క్యాప్‌ సూచీ నామ మాత్రపు లాభంతో ముగిసింది.