For Money

Business News

సూపర్‌ రికవరీ…18200పైన నిఫ్టి

బై ఆన్‌ డిప్స్ ఫార్ములా ఇపుడు మార్కెట్‌లో స్టాండర్డ్‌ సూత్రంగా మారింది. యూరో మార్కెట్ల పతనంతో కుంగిన నిఫ్టి… యూరో మార్కెట్లు కోలుకోవడంతో… నిఫ్టి కూడా కోలుకుంది. ఉదయం 18255ని తాకిన నిఫ్టి మిడ్‌ సెష్‌లో 18064 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. దీనికి ప్రధాన కారణం యూరో మార్కెట్లు అర శాతం దాకా నష్టాల్లోకి జారుకోవడం. కేవలం గంటలోనే యూరో మార్కెట్లు గ్రీన్‌లోకి వచ్చేశాయి. అలాగే మన మార్కెట్లు కూడా. ఇవాళ మార్కెట్‌లో చాలా వరకు షేర్లు ఫలితాలకు బాగా స్పందించాయి. నిఫ్టి 85 పాయింట్ల లాభంతో 18202 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకు షేర్లు బాగా రాణించాయి. నిఫ్టి బ్యాంక్‌ ఒక శాతం పెరిగింది. ఇక నిఫ్టి విషయానికొస్తే అద్భుత ఫలితాలు ప్రకటించిన బ్రిటానియా షేర్‌ 8.43 శాతం లాభంతో ముగిసింది. ఇక ఎస్‌బీఐ కూడా 3 శాతంపైగా లాభంతో ముగిసింది. అయితే బ్యాంకుల్లో ఇవాళ రియల్‌ స్టార్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా. ఈ షేర్‌ ఇవాళ పది శాతం సీలింగ్‌ను తాకిన తరవాత 9.46 శాతం లాభంతో ముగిసింది. జొమాటో 3 శాతం పెరిగింది. ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో దివీస్‌ ల్యాబ్‌ దాదాపు 9 శాతం నష్టంతో రూ.3419 వద్ద ముగిసింది.