For Money

Business News

17900పైన ముగిసిన నిఫ్టి

ఇవాళ మార్కెట్‌ దాదాపు గరిష్ఠ స్థాయి వద్దే ముగిసిందనాలి. ఒకవైపు యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నా… అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నా… నిఫ్టి ఇవాళ చాలా పటిష్ఠంగా రోజంతా గ్రీన్‌లో కొనసాగింది. ఇవాళ మార్కెట్‌లో స్వల్ప కరెక్షన్‌ వస్తుందని చాలా మంది అనలిస్టులు అంచనా వేసినా.. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ బూస్ట్‌తో నిఫ్టి 17965ని తాకి.. 17940 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 115 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌ మళ్ళీ 60,000 స్థాయిని దాటింది. ఇవాళ 417 పాయింట్లు పెరిగి 60260 పాయింట్లకు చేరింది.ముఖ్యంగా నాన్‌ బ్యాంకింగ్‌, ఆటో షేర్లు బాగా లబ్ది పొందాయి. బజాజ్‌ ట్విన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కౌంటర్లు భారీ లాభాలతో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ ఇవాళ టాప్‌ గెయినర్. హీరో మోటోకార్ప్‌లో ర్యాలీ ఇవాళ కూడా కొనసాగింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో ఐసీఐసీఐ జీఐ అయిదున్నర శాతం పెరగడం విశేషం. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో జీ ఎంటర్‌టైన్మెంట్‌ దాదాపు ఆరు శాతం లాభపడింది. అన్ని ప్రధాన మీడియా కంపెనీల షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. బ్యాంక్‌ షేర్లలో మిడ్‌ క్యాప్‌ బ్యాంకుల షేర్లు గణనీయంగా లబ్ది పొందాయి. బ్యాంక్‌ బరోడా షేర్‌ 4 శాతంపైగా లాభంతో ముగిసింది.