For Money

Business News

17,700పైన ముగిసిన నిఫ్టి

మిడ్‌ సెషన్‌ తరవాత కోలుకున్నా… ఒక శాతం నష్టంతో నిఫ్టి ముగిసింది. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న నిఫ్టి మిడ్‌ సెషన్‌కు ముందు 17655కు క్షీణించింది. యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నా … ప్రధాన మార్కెట్ల నష్టాలు ఒక శాతంలోపే ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా నిఫ్టి ఒక శాతం నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నిఫ్టి నెక్ట్స్‌ లేదా మిడ్‌ క్యాప్‌ సూచీల్లో పెద్దగా నష్టాలు లేవు. వాస్తవానికి మిడ్‌ క్యాప్‌ సూచీ లాభాల్లో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి అరశాతం, ఆర్థిక సంస్థల నిఫ్టి 0.8 శాతం నష్టపోయాయి. నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో భారీగా క్షీణించిన మిడ్‌ క్యాప్‌ సూచీ అనూహ్యంగా పుంజుకుంది.2.30 గంటలకు ఈ సూచీ గ్రీన్‌లోకి వచ్చేసింది. ఆరంభంలో నష్టాల్లో ఉన్న బాటా ఇండియా క్లోజింగ్‌లో మూడు శాతం వరకు లాభాల్లో ముగియడం విశేషం.