For Money

Business News

17,650పైన ముగిసిన నిఫ్టి

యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా… మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి.నిఫ్టి 17,665 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో కలిస్తే నిఫ్టి 126 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌ 442 పాయింట్ల లాభంతో 59,245 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 3 శాతంపైగా లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచాయి. ఇక 1.71 శాతం నష్టంతో నెస్లే టాప్‌ లూజర్‌గా ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ స్వల్ప నష్టంతో క్లోజ్‌ కాగా, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ అర శాతం లాభంతో క్లోజైంది. అన్నింటికన్నా నిఫ్టి బ్యాంక్‌ దాదాపు ఒక శాతం లాభంతో ముగిసింది. కొటక్‌ బ్యాంక్‌తో ఒప్పందం జరుగనుందనే వార్తలతో ఏడు శాతం దాకా ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్‌ పెరిగింది. బ్యాంక్‌ ఆ వార్తలను ఖండించడంతో మూడు శాతం లాభంతో రూ. 123 వద్ద ముగిసింది. ఇవాళ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ అయిదు శాతం పెరగడం విశేషం. ఇక రిలయన్స్‌ గ్రూప్‌ మీడియా కంపెనీలైన టీవీ18 బ్రాండ్‌ కాస్ట్‌ ఏడున్నర శాతం లాభపడగా, నెట్‌వర్క్‌ 18 షేర్‌ 5.5 శాతం లాభంతో ముగిసింది.