For Money

Business News

యూరో మార్కెట్లకు భారీ నష్టాలు

యూరప్‌ దేశాలకు చమురు, గ్యాస్‌ సరఫరాలపై రష్యా ఆంక్షలు విధించింది. ప్రధాన గ్యాస్‌ పైప్‌లైన్ల ద్వారా గ్యాస్‌ సరఫరా ఆపేసింది. మరోవైపు క్రూడ్‌ ధరలు తగ్గకుండా ఉండేందుఉ ఒపెక్‌ దేశాలు క్రూడ్‌ సరఫరా తగ్గించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఇక అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇవాళ లేబర్‌ డే సందర్భంగా అమెరికా మార్కెట్లకు సెలవు. క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ రెండు శాతం పైగా పెరిగింది. అలాగే బులియన్‌ మార్కెట్‌ రిస్తేజంగా మారింది. ధరల్లో ఎలాంటి మార్పు లేదు.