For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. నిన్న యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. యూరప్‌ దేశాలకు ప్రధాన పైపుల ద్వారా చమురు సరఫరా కట్టడి చేయాలని రష్యా నిర్ణయించడం దీనికి ప్రధాన కారణం. మరోవైపు మాంద్యం కారణంగా డిమాండ్‌ తగ్గుతుదన్న అంచనాతో ముడి చమురు ధరలు బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నిన్న భేటీ అయిన ఒపెక్‌ దేశాలు ముడి చమురు సరఫరాను కట్టడి చేయాలని నిర్ణయించాయి. దీంతో నిన్న ముడి చమురు ధరలు మూడు శాతం పెరిగాయి. డాలర్ స్థిరంగా ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా లాభాలు అర శాతం లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి పాతిక పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు.