For Money

Business News

నిఫ్టి అప్‌.. యూరప్‌ డౌన్‌

అమెరికా మార్కెట్లకు ఇవాళ సెలవు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. యూరప్‌కు క్రూడ్‌, గ్యాస్‌ సరఫరాపై రష్యా మళ్ళీ ఆంక్షలు విధించడంతో యూరో మార్కెట్లు గందరగోళంలో పడ్డాయి. చాలా సూచీలు రెండు శాతంపైగా నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఉదయం నుంచి పెరుగుతూ వచ్చిన నిఫ్టి ఇపుడు 17659 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 36 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ షేర్లు వెలుగులో ఉన్నాయి. బజాజ్‌ ఆటో మాత్రం టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్‌ను కేవలం బ్యాంకు షేర్లు కాపాడుతున్నాయి. యూరో మార్కెట్లలో పతనం, అమెరికా ఫ్యూచర్స్‌ స్థిరంగా ఉండటంతో… నిఫ్టి చివరిదాకా గ్రీన్‌లో ఉంటుందా.. లేదా లాభాల స్వీకరణతో పడుతుందా అన్నది చూడాలి.