For Money

Business News

17,400పైన ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన తరవాత జరిగిన తొలి ట్రేడింగ్‌ సెషన్‌ ఇది. గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన అనేక కంపెనీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ముగియగా, యూరో మార్కెట్లు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ మార్కెట్లన్నీ గ్రీన్‌లోకి వచ్చే అవకాశముంది. దీనికి కారణం అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటమే. ఉదయం 17,805 పాయింట్ల స్థాయిని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌ తరవాత 2.30 గంటల ప్రాంతంలో నిఫ్టి 17,280కు పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 17,416 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 348 పాయింట్ల నష్టంతో ముగిశాయి. నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీ 258 పాయింట్ల నష్టంతో అంటే 2.96 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ సూచీ 1.86 శాతం పడిపోగా, బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్‌ నిఫ్టి 2 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ప్రి పెయిడ్‌ చార్జీలను 20 శాతంపైగా పెంచడంతో భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.