For Money

Business News

200 పాయింట్లకుపైగా లాభపడిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన పాజిటివ్‌ సంకేతాల కారణంగా నిఫ్టి 16250పైన ముగిసింది. నిన్న భారీ లాభాల్లో ముగిసిన యూరో మార్కెట్లు ఇవాళ కూడా 1.5 శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. దీంతో నిఫ్టికి ఎక్కడా ఒత్తిడి రాలేదు. దీంతో ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 229 పాయింట్ల లాభంతో 16278 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌ నుంచి ఇవాళ గట్టి మద్దతు లభించింది. బ్యాంక్‌ నిఫ్టి రెండు శాతం దాకా లాభపడగా, నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు 1.5 శాతం లాభంతో ముగిశాయి. ఐటీ షేర్లకు ఇవాళ మంచి డిమాండ్‌ వచ్చింది. హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి ఏకంగా 41 షేర్లు ఇవాళ లాభంతో ముగిశాయి. ఆర్థిక ఫలితాలు కాస్త నిరాశగా ఉండటంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒక శాతం నష్టంతో ముగిసింది. మార్కెట్‌ ఈస్థాయిలో లాభపడినా..ఎల్‌ఐసీ షేర్‌ రూ.12 నష్టంతో క్లోజ్‌ కావడం విశేషం. ఇటీవల బాగా పెరిగిన లారస్‌ ల్యాబ్‌ ఇవాళ మూడు శాతంపైగా క్షీణించింది.