For Money

Business News

కొనసాగుతున్న లాభాలు

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అప్‌ట్రెండ్‌తో మన మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. కొద్ది సేపటి క్రితం 16227ని తాకిన నిఫ్టి ఇపుడు 16208 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 159 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.నిఫ్టిలో 46 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. హిందాల్కో, ఇన్ఫోసిస్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ నిఫ్టి టాప్‌ లూజర్‌గా ఉంటోంది. మొన్న ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆరంభంలో స్థిరంగా ఉన్నా… క్రమంగా అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ప్రస్తుతం రూ. 20 నష్టంతో ట్రేడవుతోంది. దీవీస్‌ ల్యాబ్‌ ఉదయం లాభాల్లో ఉన్నా… ఇపుడు నష్టాల్లోకి వచ్చింది. చాలారోజుల తరవాత మళ్ళీ రెయిన్‌బో హాస్పిటల్స్‌ రూ.500 దాటింది. కాని ఇంకా ఇష్యూ ధరను దాటలేదు.