For Money

Business News

5జీ బిడ్డింగ్‌ అదానీకి అర్హత

5జీ స్పెక్ట్రమ్‌ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హులైన కంపెనీల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌తో పాటు అదానీ డేటా నెట్‌వర్క్స్‌ దరఖాస్తులు అర్హమైనవిగా కేంద్ర ప్రకటించింది. అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నెట్‌వర్త్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (EMD)ని కూడా ఖరారు చేశారు. అత్యధికంగా రిలయన్స్‌ జియో రూ. 14,000 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 5500 కోట్లు, వొడాఫోన్‌ ఇండియా రూ. 2200 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అదానీ నెట్‌వర్స్స్‌ రూ.100 కో్ట్లు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు కంపెనీలలో రూ. 1,97,790 కోట్లతో రిలయన్స్‌ జియో టాప్‌లో ఉంది. రూ.75886 కోట్లతో భారతీ ఎయిర్‌టెల్‌ రెండోస్థానంలో ఉంది. వొడాఫోన్‌ నెట్‌వర్త్‌ మైనస్‌ రూ. 80,918 కోట్లని కేంద్రం పేర్కొంది.