For Money

Business News

NIFTY TODAY: నిఫ్టి బ్రే కౌట్‌?

నిఫ్టి 175 పాయింట్లు పడిన నిఫ్టికి ఇవాళ భారీ ఓపెనింగ్‌ లభించనుంది. దిగువ స్థాయిలో కొనుగోలుకు నిన్న మంచి అవకాశం లభించింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16900ని దాటే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 16,663. నిఫ్టి గనుక ఓపెనింగ్‌లో ఈ స్థాయిని దాటితే బ్రేకౌట్‌ దాటినట్లే. ఇవాళ్టి లెవల్స్‌ ప్రకారం నిఫ్టికి బ్రేకౌట్‌ స్థాయి 16885. ఈ స్థాయి పైన కొనసాగే పక్షంలో ర్యాలీ ఉంటుంది. అయితే 16823-16885 మధ్య నిఫ్టికి గట్టి మద్దతు అందాల్సి ఉంది. ఎందుకంటే 16,780 ప్రాంతంలో సెల్ సిగ్నల్‌ ఉంది. నిన్న దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారు ఇవాళ లాభాలను కనీసం పాక్షిక లాభాలను స్వీకరించడం మంచిది. రాత్రి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రావడంతో పాటు రేపు మార్కెట్‌లో వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. అలాగే ఈవారంలో రేపే చివరి ట్రేడింగ్‌ రోజు. శుక్రవారం హోలి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఫెడ్‌ నిర్ణయానికి మార్కెట్‌ సానుకూలంగా స్పందిస్తే… మార్కెట్‌లో రేపు కూడా హోలి వాతావరణం ఉండొచ్చు.

బ్రేకౌట్‌ 16885
రెండో ప్రతిఘటన16823
తొలి ప్రతిఘటన 16782
నిఫ్టి కీలక స్థాయి 16715
తొలి మద్దతు 16544
రెండో మద్దతు 16503